[BA-S 1136] 
B.A. (CBCS) DEGREE EXAMINATION 
First Semester Part I – GENERAL TELUGU 
(Common with B.A., B.Sc., B.Com., B.B.A., B.C.A. & 
BHM & CT/B.Sc.H & HA) 
(Effective from 2016-2017 admitted batch) 
Time: Three hours      Maximum: 75 marks 
పార్ట్ ఎ – (5 x 5 = 25 మార్కులు) 
క్రింది ఎనిమిది ప్రశ్నలలో ఏవేని ఐదు ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము. 
1. నన్నయ కవితాగుణములు. 
2. ద్రౌపది తన 'ప్రశస్తి' ని గురించి కృష్ణునితో చెప్పుకొన్న మాటలు. 
3. కన్యక గుండం చుట్టూ తిరిగి నమస్కరిస్తూ జనులను ఉద్దేశించి చెప్పిన హితబోధ. 
4. శ్రీశ్రీ 'చరిత్రకు' ఇచ్చిన కొత్త నిర్వచనం. 
5. చింతల తోపు కథలో వర్ణింపబడిన పిల్లల ఆటలు. 
6. సావుకూడు' లో వర్ణితమయిన 'అనంతపురం జిల్లా కరువు. 
7. తెలుగులో 'రుగాగము' సంధి సూత్రాలు. 
8. క్రింది అయిదింటి దోషాలను సవరించి సాధురూపాలను వ్రాయండి. 
(a) సివుడు 
(b) అబేదము 
(c) పాటకుడు 
(d) ముగ్రము 
(e) సంది కార్యములు. 
పార్ట్ బి – (5 x 10 = 50 మార్కులు) 
ప్రతి యూనిట్ నుండి ఒక ప్రశ్నకు సమాధానము వ్రాయుము. 
UNIT I 
9. ఈ క్రింది పద్యాలలో ఒక దానికి ప్రతిపదార్ధ తాత్పర్యాలు వ్యాకరణాంశాలు తెలపండి. 
(a) తన కాజ్ఞవశవర్తులై మహి సమస్త క్షత్ర వంశేశు లె 
ల్లను భక్తిం బని సేయు చుండఁగ విశాలంబైన సత్కీర్తి ది 
గ్వనితా మౌక్తిక దామలీల వెలుఁగన్ వారాశి పర్యంత భూ 
జన రక్షాపరుఁడయ్యె శంతనుఁడు రాజఁరాజ ధర్మస్థితిన్. 
         లేదా 
(b) ద్రోవది బండురంబయిన క్రొమ్ముడి గమ్మున విడ్చి వెండ్రుకల్ 
దావలచేతఁ బూని యసితచ్చవిఁ బొల్చు మహాభుజంగ మో 
నా విలసిల్లి వ్రేలఁగ మనంబున (బొంగు విషాద దోషముల్ 
కానగ లేక బాష్పములు గ్రమ్మగ దిగ్గన లేచి యార్తయై. 
UNIT II 
10. (a) గంగా శంతనుల - కథలోని శాపవృత్తాంతములు వివరించండి. 
         లేదా 
(b) 'ద్రౌపది పరిదేవనము' ఆధారముగా స్త్రీల మనస్తత్వాలను ఆవిష్కరించండి. 
UNIT III 
11. (2) 'కన్యక' కథ ఆధారంగా గురజాడ సమాజానికిచ్చిన సందేశం వివరించండి. 
         లేదా 
(b) శ్రీశ్రీ దేశచరిత్రలోని శ్రామికుల జీవిత చిత్రణ వివరించండి. 
UNIT IV 
12. (a) 'చింతల తోపు' కథలో వర్ణితమయిన రైతుల కష్టనష్టాలు. 
         లేదా 
(b) 'సావు కూడు' కథలోని గ్రామీణ జీవిత చిత్రణ. 
UNIT V 
13. (a) సంస్కృత సంధులను సోదాహరణంగా వివరించండి. 
         లేదా 
(b) ఈ క్రింది వానికి విగ్రహ వాక్యములు వ్రాసి అవి ఏ సమాసము అని గుర్తించండి. 
(i) దివ్యాంగన 
(ii) హృదయతాపము 
(in) నాలుగడుగులు 
(iv) అసహాయులు 
(v) భరతవంశము.