[BS - S 2108]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION..
Third Semester
Part II - Physics
Paper III - WAVE OPTICS
(For Maths Combinations)
(Effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
PART A = (5 X 5 = 25 marks)
Answer any FIVE questions out of the following eight questions.
1. Derive achromatic condition using two thin lenses separated by a distance.
కొంత దూరం ఎడంగా ఉన్న రెండు పలుచని కటకములను ఉపయోగించి అవర్ణత షరతును రాబట్టుము.
2. Explain how the diameter of a thin wire is determined by interference phenomenon.
వ్యతికరణ దృగ్విషయము ద్వారా ఒక సన్నని తీగ యొక్క వ్యాసము (మందము) ను కనుగొను విధానమును వివరించుము.
3. Compare zonal plate with convex lens.
మండల ఫలకము మరియు కుంభాకార కటకములను పోల్చుము.
4.Explain construction of quarter wave plate.
చతుర్థాంశ తరంగ ఫలకము యొక్క నిర్మాణమును వివరించుము.
5.25 cm long tube containing 30% sugar, solution rotates the plane of polarisation through 30°. Calculate the specific rotation of the solution.
25 సె.మీ. పొడవు గల ఒక గొట్టలోని 30% చక్కెర ద్రావణము ధృవతలాన్ని 300 లకు భ్రమణము చెందించిన ఆ ద్రావణముయొక్క విశిష్టధృవమును కనుగొనుము.
6.Explain population inversion and metastable state.
జనాభా తారుమారు మరియు అర్థ నిశ్చలత స్థితులను వివరించుము.
7.What are the advantages of fibre optics in communications?
దృశాతంతు ప్రసారము యొక్క ప్రయోజనములను వ్రాయుము.
8.In an optical fibre the refractive indices of core and clauding are 1.52 and 1.48 respectively. Calculate the critical angle of the system.
ఒక దృశాతంతువులోని కోర్ యొక్క వక్రీభవన గుణకము 1.52 మరియు క్లాడింగ్ యొక్క వక్రీభవన గుణకము 1.48 అయినచో ఆ వ్యవస్థ యొక్క సందిగ్ధ కోణమును లెక్కింపుము.
PART B – (5 x 10 = 50 marks)
Answer all the FIVE questions.
9. (a) Explain terms coma and astigmatism and how they are minimised.
కేంద్రకావరణము మరియు బిందు విస్తీర్ణములను మరియు వాటి నివారణ పద్ధతులను వివరించుము.
Or
(b) What is spherical aberration and explain methods to reduce it.
గోళీయ విపథనము అనగానేమి? మరియు దాని నివారించు పద్ధతులను వివరించుము.
10. (a) Describe with theory Newton's Rings experiment to determine wavelength of a monochromatic source of light.
ఏక వర్ణ కాంతి తరంగదైర్ఘ్యాన్ని కనుగొనుటకు న్యూటన్ వలయముల ప్రయోగమును తగిన సిద్ధాంతముతో వర్ణించుము.
Or
(b) Explain formation of colours is this films
తగిన సిద్ధాంతముతో పలుచని పొరలలో ఏర్పడే వర్ణముల గూర్చి వివరించుము.
11. (a) Describe the Fraunhoffer diffraction due to N slits and discuss its intensity distribution.
N చీలికల ద్వారా ఏర్పడే ఫ్రానహోఫర్ వివర్తనమును వివరించుము. వివర్తన వ్యూహములో కాంతి తీవ్రత వితరణమును చర్చించుము.
Or
(b) Explain with necessary theory how wavelength of a monochromatic light is determined by using plane transmission grating.
సమతల ప్రసార గ్రీటింగ్ ను ఉపయోగించి ఏకవర్ణకాంతి తరంగ దైర్ఘ్యమును , కనుగొను విధానమును వివరించుము.
12. (a) What is double refraction? Explain the construction and working of Nicol prism. ద్వీవక్రీభవనము అనగానేమి? నికాల్ పట్టకము యొక్క నిర్మాణము మరియు పనిచేయు విధానమును వివరించుము.
Or
(b) Describe the construction and working of Ruby laser. What are its drawbacks?
రూబీ లేసర్ నిర్మాణము మరియు పనిచేయు విధానమును వర్ణించుము. దాని దోషములను తెలుపుము.
13. (a) Explain an ellipitically polarized light and circularly polarized light are produced and detected?
దీర్ఘ వృత్తాకార మరియు వృత్తాకార దృవిత కాంతిని ఎలా ఉత్పత్తి చేయుదురో మరియు వాటిని శోధించు పద్ధతిని వివరించుము.
Or
(b) Discuss the different types of fibre optics.
వివిధ రకాల దృశాతంతులను గూర్చి చర్చించుము.